నల్లగొండ జిల్లా: సభలోనైనా, జనంలోనైనా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తీరు అందరికీ ఆదర్శంగా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదని వ్యాపారులు,రైతులు, కూలీలు అన్నారు.గురువారం పట్టణంలోకి కూరగాయల మార్కెట్ ను సందర్శించి హోల్ సేల్,రిటైల్ వ్యాపారులతో మాట్లాడుతూ ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని మరియు అమ్మకాలను పూర్తిగా తగ్గించాలని,7వ,తేదీ వరకు మార్కెట్ లో ప్లాస్టిక్ కవర్ అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని, ఆగస్టు 15 వరకు మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తి ప్లాస్టిక్ కవర్ల రహితంగా మారాలని,దాని కోసం మాతో పాటు మీరు కూడా సహకరించాలని,
అందరం కలసి నియోజకవర్గ పర్యావరణ పరిరక్షణలో భాగం అవ్వాలని పిలుపునిచ్చారు.
అనంతరం నాట్లు వేస్తున్న రైతులు,కూలీలతో కలసి వరినాట్లు వేసి,మరో రైతు పొలంలో ట్రాక్టర్ తో దమ్ము చేశారు.రైతులతో మాట్లాడుతూ అందరికీ లక్ష రూపాయల రుణ మాఫీ అయ్యిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాతో కలసి నాట్లు వేయడం చాలా సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని,మాకు అందరికీ రుణ మాఫీ జరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.