నల్లగొండ జిల్లా:తెలంగాణ కేబినెట్ మంత్రు లజాబితా విడుదలైంది.ఇప్పటికే మంత్రుల జాబితాను గవర్నర్ తమిళిసై( Tamilisai Soundararajan )కి పంపించారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు డిఫ్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క,నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు,సీతక్క,కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivasa Reddy )మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గురువారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక,రాహుల్ గాంధీ( Rahul gandhi )లు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు.