నల్గొండ జిల్లా:దేవరకొండ పట్టణంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది.సోమవారం రాత్రి చోటు పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం దేవరకొండ పట్టణంలో తాటికోల్ ఎక్స్ రోడ్ లో పాండు అనే వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది.బీమనపల్లికి చెందిన ఒక వ్యక్తిని పాండు అనే వ్యక్తి కొట్టడంతో ఇరువురి మధ్య వివాదం పెరిగి ఘర్షణకు దారితీసింది.
దీనితో పాండు చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి తన తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆవేశంతో వచ్చిన తమ్ముడు,అన్న కలిసి పాండు మీద కత్తితో దాడి చేశారు.రక్తపు మడుగులో పడిఉన్న పాండును వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు పరిస్థితి పరిశీలిస్తున్నారు.