మీరు ఎప్పుడైనా వైట్ హనీ గురించి విన్నారా..?! దాని వాడితే ఎన్ని లాభాలంటే..!

తేనె వలన ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మన అందరికి దాదాపు తెలిసిందే.తేనెతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందం కూడా మనకు సొంతం అవుతుంది.

అయితే మన అందరికి తెలిసిన తేనె చూడడానికి గోధుమ రంగులో ఉండి.తినడానికి చాలా తియ్యగా ఉంటుంది.

నిజానికి తేనెల్లో కూడా అనేక రకాల తేనెలు ఉన్నాయి.అయితే మీరు ఎప్పుడైనా వైట్ హనీ గురించిన విషయాలు విన్నారా.? అయితే ఈ తెల్లగా ఉండే తేనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఈ తేనె మాత్రమే కావాలని మరీ తెప్పించుకుని తింటారు.మనం నిత్యం ఉపయోగించే గోధుమ రంగు తేనె కంటే ఈ తెల్ల తేనెలోనే ఎక్కువ పోషకాలు దాగి ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.

మరి ఆలస్యం చేయకుండా ఆ ఉపయోగాలు ఏంటో ఓ సారి చూద్దామా.అసలు ఈ తెల్ల తేనెని ఎక్కడ నుండి మనకి లభ్యం అవుతుందో అనే విషయాన్ని ముందుగా చూస్తే.

Advertisement

తెల్ల తేనె ను ముడి తేనె అని కూడా అంటారు.ఈ తెల్ల తేనెని అరుదుగా లభించే పుష్పాలు అయిన అల్ఫాల్ఫా, ఫైర్‌వీడ్, వైట్ క్లోవర్ వంటిపుష్పాల నుంచి దీనిని సేకరిస్తారు.

ఈ వైట్ తేనెలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి.అలాగే ఆంటిబయోటిక్స్ కూడా పుష్కలంగా లభించడం వలన తెల్ల తేనెను యాంటీఆక్సిడెంట్ల గని కూడా అంటారు.

ఎవరయితే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలని భావిస్తారో.వారు ఈ తెల్ల హనీని రోజుకో స్పూన్ చొప్పున తీసుకోవాలట.

ఇలా ప్రతి రోజు తెల్ల తేనెని తినడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల దరిచేరవట.దగ్గు సమస్యలతో బాధపడే వారు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలుపుకుని అందులో తెల్ల తేనె కూడా వేసి తాగితే దగ్గు, జలుబుల నుండి ఉపశమనం సులువుగా పొందవచ్చు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలకు ఈ తెల్ల హనీ బాగా పనిచేస్తుంది.ఇంకా రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు కూడా ఈ ముడి తేనె తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి అమాంతం పెరుగుతుంది.అయితే.

Advertisement

ఈ ముడి తేనె వలన ఎన్ని ఉపాయోగాలు ఉన్నాయో.అలాగే మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి సుమా.

కేవలం డాక్టర్ గారు సలహా మేరకు మాత్రమే ఈ తెల్ల తేనెను ఉపయోగించాలి.తెల్ల తేనెను అతిగా తీసుకుంటే శరీరంలో ఫ్రక్టోజ్ అనే శాతం కొద్దిమేరా పెరుగుతుంది.

ఫలితంగా శరీరంలోని చిన్నపేగు సామర్థ్యం తగ్గిపోతుంది.అప్పుడు శరీరంలో పోషక విలువులు తగ్గి శరీరం కాస్త బలహీనపడుతుంది.

అందుకే కేవలం డాక్టర్ల సలహా తీసుకుని ఎంత ముడి తేనె వాడాలో తెలుసుకుని అంత మాత్రమే ఈ తేనెను ఉపయోగించాలి.

తాజా వార్తలు