అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇండో అమెరికన్స్ కు తన ప్రభుత్వంలో కీలక భాద్యతలు అప్పగిస్తున్న విషయం విధితమే.అధికారంలోకి వచ్చింది మొదలు నేటి వరకూ కూడా బిడెన్ ఎంతో మంది భారతీయులకు తన కొలువులో చోటు కల్పించారు.
గత అధ్యక్షుడు ఎవరూ కూడా భారతీయులకు ఈ స్థాయిలో ప్రభుత్వంలో స్థానం కల్పించిన దాఖలాలు లేవు.అయితే బిడెన్ తాజాగా భారత సంతతి ముస్లిం వ్యక్తికి అత్యంత కీలకమైన పదవిని అప్పగించారు.
భారత సంతతికి చెందిన రషద్ హుస్సేన్ ను అంతర్జాతీయ మత స్వేఛ్చ అంబాసిడర్ గా నియమించారు.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.ఈ కీలక పదవికి ఎంపికైన మొట్టమొదటి ముస్లిం వ్యక్తిగా హుస్సేన్ రికార్డ్ క్రియేట్ చేశారు.హుస్సేన్ ప్రస్తుతం జాతీయ భద్రతా మండలిలో భాగస్వామిగా అలాగే , గ్లోబల్ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో హుస్సేన్ జస్టిస్ నేషనల్ సెక్యూరిటీ లో సీనియర్ కౌన్సిలర్ గా కూడా పనిచేశారని తెలిపింది వైట్ హౌస్.
![Telugu Bidennominate, Joe Biden, Rashad Hussain, Seniorcouncilor, Terrorism-Telu Telugu Bidennominate, Joe Biden, Rashad Hussain, Seniorcouncilor, Terrorism-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/07/Rashad-Hussain-Senior-Councilor-in-Justice-National-Security.jpg )
విద్యా, అంతర్జాతీయ భద్రతా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర రంగాలలో తమ భాగస్వాయం విస్తరించడానికి ఐక్య రాజ్య సమితి, పలు సంస్థలలో కూడా పనిచేశారు.అంతేకాదు ఒబామా హయాంలో స్ట్రాటజిక్ టెర్రరిజం కమ్యునికేషన్స్, వైట్ హౌస్ కౌన్సిల్ కోసం ఇస్లామిక్ కోపరేషణ్ ఆర్గనైజేషన్ కు ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు.ఇదిలాఉంటే హుస్సేన్ యేల్ లా స్కూల్ నుంచీ లా డిగ్రీ పొందారు, అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచీ అరబిక్ , ఇస్లామిక్ లో మాస్టర్ డిగ్రీ పొందారు.
ఇదిలాఉంటే హుస్సేన్ నియామకం పట్ల అమెరికాలోని భారతీయ ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.