నల్లగొండ జిల్లా: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్‌సి 2023 బుధవారం నుంచి ప్రారంభం కానుంది.రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు,వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి.వీటికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుండగా,అక్టోబర్ 21న ముగియనుంది.
పరీక్షను నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారు.జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.
మొత్తం పోస్టులు:5089
స్కూల్ అసిస్టెంట్: 1,739
లాంగ్వేజ్ పండిట్: 611
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్: 164
సెకండరీ గ్రేడ్ టీచర్: 2,575
అప్లికేషన్ ఫీజు: రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 21
ఆన్‌లైన్ పరీక్ష:నవంబర్ 20 నుంచి 30 వరకు.