మార్కెట్ అభివృద్ధికి పాటు పడతా:ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

నల్లగొండ జిల్లా: వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం పెంచి రైతులకు మౌలిక వసతులు కల్పనతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ( MLA Battula Lakshma Reddy )అన్నారు.మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం మార్కెట్ కమిటీ ఆఫీస్ లో టీఎన్జీవోస్ రాష్ట్ర మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం,ఉమ్మడి నల్గొండ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

 Will Fall Along With Market Development Mla Battula Lakshmareddy-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి వ్యవసాయ మార్కెట్ కమిటీ( Agricultural Market Committee ) పరిధిలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల ద్వారా జరిగే రైస్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా మిర్యాలగూడ ఆసియా ఖండంలోనే ప్రసిద్ధి చెందిందన్నారు.

మార్కెట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి,కార్యదర్శి ఎం.డి ముక్రం,జిల్లా అధ్యక్షుడు బి.మధుబాబు,కార్యదర్శి కె.ఉమామహేశ్వర్, మార్కెట్ కార్యదర్శి కె.శ్రీధర్,నల్గొండ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేశ్వరరావు( Nageswara Rao ),కాంగ్రెస్ లీడర్లు స్కైలాబ్ నాయక్, నాగు,రవిచంద్ర,మహేంద్ర రెడ్డి,మార్కెట్ ఎంప్లాయిస్ సిహెచ్.గిరిప్రసాద్,దైద సైదులు,శ్రీకాంత్,సుజాత, పురం రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube