నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలం పినవూర గ్రామానికి చెందిన తేరా రజినీకాంత్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రజినీకాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పలు కేసులు వాదించారు.
అంతేకాకుండా ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు రవి తదితరుల వ్యక్తిగత కేసులను సహితం వాదించారు.46 ఏండ్ల వయసు గల రజినీకాంత్ రెడ్డి 2004లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు.అప్పటినుంచి ఆయన నిరంతరంగా న్యాయవాద వృత్తిలో సేవలు అందిస్తున్నారు.
ఆయనను అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించిడం పట్ల నాగార్జున సాగర్ నియోజకవర్గ,పెద్దవూర మండల ప్రజలు,పినవూర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అతని సేవలు మరింత కాలం కొనసాగాలని కోరుతున్నారు.