మనుధర్మాన్ని పెట్రోల్ పోసి తగుల పెట్టండి:సుభాష్ చంద్రబోస్ లేఖ!

నల్లగొండ జిల్లా:కుల,మత,వర్గ దోపిడి గుండెలపై నిప్పు పెట్టండి!మనుధర్మాన్ని పెట్రోల్ పోసి తగుల పెట్టండి!మానవతా వాదాన్ని బలంగా నిలబెట్టండి!చట్టాలను కలిగినోడి చుట్టాలుగా మార్చుకున్న దోపిడి హంతకులపై ప్రజా యుద్ధాన్ని కొనసాగించండి!అసాంఘిక నేరాలు-ఘోరాలను ఓడిద్దాం!భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం!మనిషిని,మనిషిగా చూడ నిరాకరించి, తోటి మనిషిని బానిసగా మార్చుకొని తరతరాలుగా అవమానాలకు,అణచివేతలకు,దోపిడిపీడనలకు కారణమైనది ఈ దుర్మార్గమైన కులవ్యవస్థ.ఇలాంటి అమానవీయమైన కులవ్యవస్థకు పునాది అయిన మను (అ) ధర్మ శాస్త్రాన్ని తగులబెట్టి,కులవ్యవస్థపై యుద్ధం ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజానేస్తం,ప్రజా పరివర్తకుడు,ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

 Pour Petrol On Humanity And Cover It: Subhash Chandra Bose's Letter!-TeluguStop.com

అణగారిన వర్గాలను,మహిళలను,మత మైనార్టీలను విద్యకు,ఉద్యోగాలకు,రాజకీయాలకు,సంపదలకు దూరం చేసిన మనుధర్మాన్ని యావత్ పీడిత వర్గాల ప్రజలు ఐక్యంగా హత్య చేయాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ,పేదలకు,మహిళలకు బోరన్నగారు రాసిన బహిరంగ లేఖ ద్వారా కోరారు.మనుధర్మం అన్ని హక్కులకు దూరం చేస్తే రాజ్యాంగం హక్కులను కల్పిస్తూ,సమస్త జీవకోటికి స్వేచ్ఛ,సమానత్వం, సోదరభావంతో కూడిన మానవీయ సమాజ నిర్మాణమే లక్ష్యంగా భారత రాజ్యాంగం వెలుగులోకి వచ్చిందని, ఒక్కమాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగం ఒక హక్కులపత్రం,1949 నవంబర్ 26న భారత ప్రజలు భారత రాజ్యాంగ నిర్ణాయక సభ సుదీర్ఘ చర్చల అనంతరం రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ,దానిని సాధికార శాసనంగా చేసి, తమకు తాము అంకితం చేసుకున్న అద్భుత సన్నివేశంగా ప్రజానేస్తం బోరాన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ చరిత్రలో ఒక మైలురాయి.పరాయి పాలన నుంచి విముక్తి సాధించుకున్న దేశం.

ప్రజల ప్రయోజనాలు, రక్షణ బాధ్యత దేశ పాలకులపై వుంచింది రాజ్యాంగమన్నారు.రాజ్యాంగం స్వతంత్ర భారతాన్ని సర్వసత్తాక,సామ్యవాద,లౌకిక ప్రజాస్వామ్య,గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది.

నాటి నుండి భారతదేశం స్వేచ్ఛ, సమానత్వ సంక్షేమ రాజ్యాంగ అవతరించింది.నేటికి 73 వసంతాలను నింపుకుంది.1950 జనవరి 26 రిపబ్లిక్ డే నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది.చదువుకునే హక్కును,ఉద్యోగం పొందే హక్కును సామాజిక,ఆర్థిక, న్యాయాన్ని పొందే హక్కును,శ్రమ దోపిడి,పీడనల నుండి వెట్టిచాకిరి నుండి విముక్తి అయి కనీస వేతనాన్ని పొందే హక్కును మనిషిగా జీవించే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది.

ఎవరికి నచ్చిన భావాలను ఆచరించే, ప్రచారం చేసుకునే భావ ప్రకటన హక్కును, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును కల్పించింది భారత రాజ్యాంగం.అసమానత్వ సమాజంలో మానవీయ సమాజం నిర్మాణం కోసం ఉపయోగపడి సామాజిక విప్లవానికి నాంది పలికిన రాజ్యాంగంపై దాడులు చేస్తూ ఆ స్ఫూర్తిని నీరుగార్చేందుకు సనాతన సంప్రదాయవాదులు కుట్రలకు పాల్పడుతున్నారనీ ప్రజా బంధువు కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

వేల కులాలు,అనేక మతాలు,జాతులకు నిలయమైన భారత సమాజం బహుళ సమాజంగా మారింది.కానీ,మనువాదులు ఏకత్వం ముసుగులో రాజ్యాంగం కల్పించిన హక్కులను నిరాకరిస్తున్నారని,మత మైనార్టిలపై దాడులు చేస్తూ ఘర్ వాపస్,పేరిట దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని,తనకు నచ్చిన భావాలను,తిండిని, మతహక్కులను హరిస్తూ హత్యలు,అవమానాలు, దాడులకు,దౌర్జన్యాలు,అమానవీయ సంఘటనలకు పాల్పడుతూ సంప్రదాయ ముసుగులో తిరిగి బానిస సమాజం వైపు భారతదేశాన్ని నడిపించేవరకు తహతహలాడుతున్నారని ప్రజా పరివర్తకుడు,పీడిత,ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కులమత విద్వేషాల రాజకీయాలను ఓడించి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపునిచ్చారు.రాజ్యాంగాన్ని హక్కులను ప్రతి గ్రామ,వాడలలో,పాఠశాలల్లో,హాస్టళ్ళలో, విద్యాలయాల్లో ప్రచారం చేయాలని,పాదయాత్రలు,జీపు యాత్రలు,రసఫర్ ఇక్వాలిటి,రన్ఫర్ క్యానిస్టూషన్,రాష్ట్ర, జిల్లా,మండల,గ్రామ స్థాయిలో సదస్సులు,చర్యలు, సమావేశాలు,నాటికలు,వ్యాసరచన,ఉపన్యాస పోటీలను నిర్వహిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు మరింత ఇనుమడింప చేయాలని ప్రజలను,ప్రజాస్వామిక వాదులను ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.

ఈ ప్రచారోద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపునిచ్చారు.Bharat organization for Rural Awareness ( B O R A ) గోడలపై రాస్తున్న రాతలు అభినందనీయమని,రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలలనూ దేశంలోని ప్రతి సామాన్య మనిషి కూడా తెలుసుకోవాలని ప్రజా పరివర్తకుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న పిలుపునిచ్చారు.

ఆర్టికల్ 1 నామధేయం,భూభాగం ఇండియా అంటే భారత్, రాష్ట్రాల కలయికతో ఏర్పడింది.నూతన రాష్ట్రాల విలీనం ఏర్పాటు,(పార్లమెంటు తన శాసనం ద్వారా నూతన రాష్ట్రాలను భారత దేశంలో చేర్చవచ్చు.

ఆర్టికల్ 2,ఆర్టికల్ 3,4 నూతన రాష్ట్రాల ఏర్పాటు,రాష్ట్ర సరిహద్దు సవరణ (నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది.(తెలంగాణ ఉద్యమంలో ఈ ఆర్టికల్ విస్తృత ప్రచారంలోకి వచ్చింది) ఆర్టికల్ 5,6,7,8,9,10, 11 లు దేశ పౌరసత్వం గురించి చర్చించాయి.

విభాగం 3 ప్రాథమిక హక్కులు (Fundamental Rights) గురించి నిర్వచించింది.ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను హరించి వేసే శాసనాలు చెల్లవు.ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు (Right to Equality) చట్టం ముందు అందరూ సమానులే.కుల,మత,లింగ వివక్షతలకు తావు లేదు.

ఆర్టికల్ 15,ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన ఉద్యోగావకాశాలు అంటరానితనం నిషేధం.(అంటరానితనం నిషేధం,అంటరానితనాన్ని ఏరూపంలో ఆచరించకూడదు.

అంటరానితనం పేరుతో తక్కువగా చూస్తే చట్ట ప్రకారం అది శిక్షార్హం) ఆర్టికల్ 17,అధికరణం 19.స్వేచ్ఛ (Rights to Freedom) భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైనవి (Freedom of Speech) ఆర్టికల్ 20 వ్యక్తి స్వేచ్ఛ,జీవించే హక్కు (Protection of life and personal liberty) ఆర్టికల్ 21ఎ విద్య హక్కు (Right to Education)(ఆరు సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికి నిర్బంధ ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత.ఆర్టికల్ 22 నిర్బంధం – పరిమితులు (ఒక వ్యక్తిని అరెస్టు చేసింది,నిర్బంధంలో ఉంచినప్పుడు,సాధ్యమైనంత త్వరగా అరెస్టుకు గల కారణాలను అతనికి తెలియజేయాలి.న్యాయవాదితో సంప్రదింపులు,నియమించుకునే హక్కు,అరెస్టు చేసిన 24 గంటలలో కోర్టులో హాజరు పర్చాలి.

దోపిడి నుండి రక్షణ పొందే హక్కు (Right Againist Explotation) ఆర్టికల్ 23 శ్రమశక్తిని దోపిడి చేయరాదు.ఆర్టికల్ 24 చిన్న పిల్లలతో చేత ఫ్యాక్టరీలలో పని చేయించరాదు.

మత స్వేచ్ఛ (Right to Freedom of Religion) ఆర్టికల్ 25 మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు,ప్రచారం చేసుకునే హక్కు.ఆర్టికల్ 28 విద్యాలయాలలో మత బోధన పనికిరాదు.

సాంస్కృతిక,విద్యా హక్కులు (Cultural and Educational Rights) ఆర్టికల్ 29,ఆర్టికల్ 30 అల్ప సంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ.విద్యాలయాలను స్థాపించి,నిర్వహించుకొనుటలో అల్ప సంఖ్యాకుల హక్కులు.ఆస్తి హక్కు తొలిగిపోయింది.(ఆర్టికల్ 31 ఆస్తి హక్కుకు సంబంధించినది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించటం.20.6.1979 నుండి 31వ అధికరణం అమలులో లేదు.ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు కేవలం ఒక హక్కు మాత్రమే) ఆర్టికల్ 31-ఎ.

భూముల స్వాధీనానికి సంబంధించిన శాసనాలు.విభాగం 4 లో ఆదేశిక సూత్రాలు (Directive principles of state policy) ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలను అమలు చేయవలసిందిగా న్యాయస్థానాలు ఆదేశించరాదు.

ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమానికి అనుగుణమైన సామాజిక వ్యవస్థ ఉండాలి.ఆర్టికల్ 39 ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 40 గ్రామ స్వపరిపాలన పంచాయితీలు,ఆర్టికల్ 41 వృద్ధులు,ఆశక్తులు మొదలైన వారికి సహాయం అందజేయాలి.

ఆర్టికల్ 42 పనిచేసే పరిస్థితులలో మానవీయత,ప్రసూతి సౌకర్యాలు,ఆర్టికల్ 43 కార్మికుల వేతనాలలో హేతుబద్ధత ఆర్టికల్ 44 ఫ్యాక్టరీ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం.ఆర్టికల్ 45 ఆరు సం.ల లోపు బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణ బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.ఆర్టికల్ 46,ఆర్టికల్ 47 మత్తుపానీయాలు నిషేధించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

ఆర్టికల్ 48,ఆర్టికల్ 48 ఎ వ్యవసాయ పశుగణాభివృద్ధి,పర్యావరణం,వన్యప్రాణాల సంరక్షణ ఆర్టికల్ 49 పురాతన కట్టడాల పరిరక్షణ.విభాగం 4 ఏ ప్రాథమిక బాధ్యతలను పాటించాలి.

భారత రాజ్యాంగము పీఠికనూ ప్రతి భారతీయుడు కచ్చితంగా రోజుకు ఒక్కసారైనా చదవాలని,చదువు రాని వారికి చదివి వినిపించాలని రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 పిలుపునిచ్చారు.Preamble:భారతదేశ ప్రజలమగు మేము,భారతదేశమును సార్వభౌమ, సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా (Sovereign Socialist Secular Democratic Republic) మరియు భారతదేశంలోని సమస్త ప్రజలందరికీ సామాజిక,ఆర్థిక,రాజకీయ న్యాయమును (Social, Economic and Political Justice) భావము,భావ ప్రకటన,విశ్వాసము,ధర్మము, ఆరాధనా స్వేచ్ఛను (Liberty of thought, expression,belief,faith and worship) అంతస్తును,అవకాశములలోను-సమానత్వము (Equality of Status and of opportunity) మరియు యావత్ భారత ప్రజలందరిలోనూ,వ్యక్తి గౌరవమును,(Dignity of the individual) జాతి ఐక్యత మరియు అఖండతను (Unity and integrity of the Nation) చేకూర్చు సౌభ్రాతృత్వమును (Fraternity) పెంపొందించుటకు, సత్య నిష్ట పూర్వకంగా తీర్మానించుకొని (having solemnly resolved).ఈ 1949వ సంవత్సరము నవంబరు ఇరువై ఆరు (26 నవంబర్,1949) దినమున మా రాజ్యాంగ సభయందు ఇందు మూలముగా,ఈ రాజ్యాంగమును అంగీకరించి,అధిశాసనము చేసి (enact) మాకు మేము ఇచ్చుకున్నవారము.ఇంతటి గొప్ప ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న రాజ్యాంగాన్ని నేడు మనుధర్మ నాదురామ్ గాడ్సే ముఠా,నాడు పూజ్యా బాపూజీ మహాత్మా గాంధీజీని హత్య చేసిన మాదిరిగానే నేడు మరింత దారుణంగా బరితెగించి నడి బజారులో దళిత, పీడిత ప్రజలనుహత్యలు చేస్తున్నదని,చట్టాలను చుట్టాలుగా మలుచుకొని కార్పోరేట్ దొంగలకు దేశాన్ని దేశ సంపదను దోచుపెడుతున్నదని,పేదలు బలహీన వర్గాల జీవితాలు చిన్న బిన్నమవుతుంటే,మరోవైపు ఆదానీ,అంబానీ లాంటి కార్పొరేట్ దొంగల ఆస్తులు అంతస్తులు కోట్లకు పడకులెత్తుతున్నాయని విప్లవప్రజాతంత్ర ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు.

కుల,మత అసమానతలను నిర్మూలించే పోరాటాలను బలోపేతం చేయాలని,వర్గ దోపిడిని సామాజిక వివక్షతలను అంతమొందించే నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని,వర్గ,కుల పోరాటాల ఐక్యతతో నూతన భారత దేశ నిర్మాణానికి యువతీ యువకులు చేయి చేయి కలపాలని,వర్గ దోపిడి గుండెలపై విలుకడు విప్లవ విన్యాసం వినిపించాలని,ప్రజలు ప్రజాస్వామిక వాదులు విప్లవ పోరాటాలలో భాగస్వాములు కావాలని సిపిఐ ఎం ఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,బాధితుల బంధువు,పీడిత ప్రజల జీవితాలలో వెలుగు రావాలని ఈ దోపిడీ చీకటి అంతం కావాలని కలలుకనే కార్యదీక్షకుడు, నూతన ప్రజాస్వామిక విప్లవ సమసమాజ స్వాప్నికుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 భారత సమస్త పీడిత ప్రజానీకానికి రాసిన బహిరంగ లేఖలో సుభాషన్న పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube