కల్లుగీత కార్మికుల ప్రాణాలకు అభయం కాటమయ్య రక్షణ కవచం

నల్లగొండ జిల్లా:కల్లు గీత కార్మికులకు కాటమయ్య కిట్లు రక్షణ( Katamayya Kits ) కవచంలా పని చేస్తాయని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి( Gutha Sukender Reddy ),నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో కల్లు గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కాటమయ్య కిట్ల పంపిణీకార్యక్రమానికి వారు ముఖ్యాతిథులు హాజరై గీత కార్మికులకు కిట్లు పంపిణీ చేశారు.

 A Protective Shield That Protected The Lives Of Stone Masons ,katamayya Kits ,-TeluguStop.com

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గీత కార్మికులను ప్రమాదం నుంచి రక్షించాలని ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు.నకిరేకల్ నియోజకవర్గంలో మొదటి విడుతగా 2008 మందికి కిట్లను పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాచుపల్లి గంగాధర్,బీసీ సంఘం మాజీ చైర్మన్ పూజర్ల సాంబయ్య,వార్డు కౌన్సిలర్లు,నాయకులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube