సీఎం రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి

నల్లగొండ జిల్లా:ఎస్సీ వర్గీకరణ లేకుండా టీచర్ పోస్టులను భర్తీ చేయడం మాదిగలకు ద్రోహం చేయడమేనని ఎమ్మార్పీఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండానే మాదిగలని మోసం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు స్థానిక డాక్టర్ బి.

 Cm Revanth Reddy Is A Traitor , Revanth Reddy , Gade Ramesh Madiga, Bakaram Srin-TeluguStop.com

ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి,ధర్నా చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఉమ్మడి నల్గొండ జిల్లా సమన్వయకర్త గోడపర్తి జానకి రామయ్య చౌదరి,ఎంఎస్పి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 11062 టీచర్ పోస్టులను ఎస్సీ వర్గీకరణ లేకుండా అమలు చేయడం మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేయడమే అవుతుందన్నారు.

మాదిగల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు.త్యాగాలు చేసి ముప్పై ఏళ్ళ పోరాటం ద్వారా సుప్రీం కోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటే ఆ ఫలాలు మాదిగలకు అందకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం దారుణమన్నారు.

మాల నాయకుల బ్లాక్ మెయిల్ కు రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు.ఇంత అత్యవసరంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని,కాంగ్రెస్ లోని మాల నాయకుల ఒత్తిడి మేరకు ఎస్సీ టీచర్ పోస్టులన్ని మాలలకు దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడన్నారు.

దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ఎదుర్కోవడానికి మాదిగ విద్యార్థులు,నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని అన్నారు.

టిపిసిసి చీఫ్ గా,నేడు సీఎంగా తన పదవి కోసం రేవంత్ రెడ్డి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నారన్నారు.మాలలైన ఏఐసీసీ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే,కొప్పుల ఈశ్వర్లకు ఆయన భయపడుతున్నారని ఆరోపించారు.

నిండు శాసనసభలో సీఎం వర్గీకరణపై మాదిగలకు హామీ ఇచ్చి ఇప్పుడు కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని అన్నారు.ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే డిఎస్సీ నియామకాలు భర్తీ చేయకుండా నిలుపుదల చేసి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే పూర్తి చేయాలని కోరారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గాదే రమేష్ మాదిగ,మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ,ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి ఎంఈఎఫ్,విహెచ్పిఎస్ నాయకులు ఆడపు నాగార్జున, మేడి శంకర్,మచ్చ ఏడుకొండలు,కొమిరస్వామి, బోడ సునీల్,మామిడి సైదులు లంకపల్లి నగేష్,మడుపు శ్రీనివాస్,సండ్ర నాగరాజు,బొజ్జ చిన్న,ఏర్పుల వెంకటయ్య, కందుల మోహన్,బొజ్జ దేవయ్య,కత్తుల సన్నీ, మాసారం వెంకన్న,తరి ఏడుకొండలు,ప్రసాద్,దుబ్బ సత్యనారాయణ,బొజ్జ నవీన్,సైదులు,చంటి,రణవీర్, విహెచ్పిఎస్ నాయకులు జలంధర్,బకరం పరమేష్, బకరం నవీన్,బకరం జానీ, సురవరం దామోదర్,బకరం లింగస్వామీ,యాదగిరి, ఆనంద్,దున్న అఖిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube