యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన దివ్యవిమాన గోపుర బంగారు తాపడం పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు.దివ్య విమాన గోపురం పనులకు సంబంధించిన రాగి విగ్రహాలను,రాగి పలకలను చెన్నెకి తరలించారు.
రాగి విగ్రహాలకు,రాగి పలకలకు చెన్నైకి తరలించే వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలయ ఈఓ భాస్కర్ రావు, ఆలయ చెర్మెన్ నరసింహమూర్తితో కలసి పూజలో పాల్గొని చెన్నైకి తరలించే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఫిబ్రవరి నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామని బీర్ల తెలిపారు.బంగారు తాపడానికి కావాల్సిన బంగారాన్ని సమకూరుస్తున్నామని చెప్పారు.







