యాదాద్రి భువనగిరి జిల్లా:రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఈడం స్వరూప స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈడెం శ్రీనివాస్- రాధా దంపతులు విజయదశమి సందర్భంగా గ్రామ పంచాయతీ మరియు పారిశుద్ద్య సిబ్బందికి బుధవారం నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీఓ రవుఫ్ అలీ హాజరై మాట్లాడుతూ ఈడెం శ్రీనివాస్ తన యొక్క సేవా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం గ్రామపంచాయతీ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు.
ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఆర్.మోహన్,మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రవ్వ అనసూర్య,గంజి రంగయ్య, అంకం పాండు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.







