నల్గొండ జిల్లా:వేములపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది.స్థానికులు తెలిపిన వివరాల మేరకు అద్దంకి-నార్కట్ పల్లి రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి పొలాల్లోకి పల్టీ కొట్టడంతో తుక్కు తుక్కు అయింది.
ఈ ప్రమాద తీరును చూస్తే కారులో ప్రయాణిస్తున్న వారు బ్రతికే అవకాశం లేదు.కానీ,బెలూన్లు ఓపెన్ కావడంతో ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.