ఒక బీసీ బిడ్డపై నీకెందుకంత వివక్ష కెసిఆర్...?

నల్లగొండ జిల్లా:నీకు,నీ కొడుకుకి,నీ అల్లుడికి రాజకీయంగా అడ్డొస్తున్నాడని,లేనిపోనీ నిందలు మోపి,ఆధారాలు లేని ఆరోపణలు చేసి,ఈటెల రాజేందర్ ను పార్టీ నుంచి వెళ్లగొట్టారని బీజేపీ నల్లగొండ జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేసీఆర్ పై ధ్వజమెత్తారు.ఈటెల రాజేందర్ ను కబ్జాకోరని,అవినీతిపరుడని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా అన్ని ప్రయత్నాలు చేసి,అర్థాంతరంగా అవసరం లేకుండానే ఒక ఉపఎన్నికకు తెరలేపి,ఆ ఎన్నికలో నీ అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎన్ని అరాచకాలు చేసినా డబ్బు, మద్యం ఏరులై పారించినా,ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా,చివరికి దళిత బంధు అంటూ కొత్త నాటకానికి తెరతీసినా నీ మాయమాటలు నమ్మని హుజురాబాద్ ప్రజలు కమలం గుర్తుపైన పోటీ చేసిన ఈటల రాజేందర్ కే పట్టం కట్టారని తట్టుకోలేక, కక్షకట్టి అసెంబ్లీలో ఎదురుగా ఆయనను చూసే ధైర్యంలేక ఇప్పుడు మళ్ళీ మరో కుట్రకు తెరలేపావని దుయ్యబట్టారు.

 Why Are You Discriminating Against A Bc Child Kcr...?-TeluguStop.com

ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే అసలు కారణం లేకుండా శాసనసభ నుంచి సస్పెండ్ చేయించావని,నీకు ఈటల రాజేందర్ అన్నా,బీజేపీ ఎమ్మెల్యేలన్నా ఎందుకంత భయం కేసీఆర్ అని అన్నారు.బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుపడితే గజగజ ఎందుకు వణుకుతున్నావని ఎద్దేవా చేశారు.

నువ్వు చేసినటువంటి అవినీతి, అక్రమాలను బయటపెడతారనే ఇదంతా చేస్తున్నావని రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని పేర్కొన్నారు.తాము చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పే దమ్మూ ధైర్యం నీకు ఉందా ప్రశ్నించారు.

అది కాకుండా వెనుకబడిన వర్గాల ప్రజాప్రతినిధులు అంటే నీకు అంత చిన్న చూపు ఎందుకని,నువ్వు ఒక దొర అనే అహంకార ముసుగులో ఉండి,ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తున్నాడనే విషయాన్ని తట్టుకోలేక నీచమైన ఆలోచనతో ఈటెల రాజేందర్ ను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయించింది వాస్తవం కాదా అన్నారు.ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని,నీ అహంకార ధోరణికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం తధ్యమని జోస్యం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube