సాగర్ వరద కాలువకు మారేపల్లి వద్ద భారీ గండి...!

నల్లగొండ జిల్లా:నాగార్జునసాగర్ వరద కాలువకు సోమవారం రాత్రి నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద భారీ గండి పడింది.ఈనెల 2న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరద కాలువకు నేటిని విడుదల చేశారు.

 A Huge Well At Marepalli To The Sagar Flood Canal , Sagar Flood Canal, Marepal-TeluguStop.com

కాగా కాలువ మరమ్మత్తులు లేకపోవడంతో పాటు అస్తవ్యస్తంగా ఉండడంవల్ల నీటిని విడుదల చేసిన మూడు రోజులకే కాలువకు గండి పడిందని రైతులు పేర్కొంటున్నారు.ఈ కాలువ ద్వారా 200 చెరువులకు నీరు చేరనుందని,సుమారు 250 గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం అందే అవకాశాలు ఉన్నాయి.

ఈ వరద కాలువకు 36 డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఉన్నాయి.కాలువల్లో బండరాళ్లు,కంపచెట్లు తొలగించకపోవడం వలన గండి పడిందని రైతులు అంటున్నారు.

కాగా ఏఎమ్మార్పి జేఈ గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు.రెండు మూడు రోజుల్లో మరమ్మతులు చేపట్టి నీటిని విడుదల చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube