నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ నియోజకవర్గ( Nagarjuna Sagar Assembly constituency ) పరిధిలోని తిరుమలగిరి (సాగర్) మండల( Tirumalagiri Sagar Mandal ) కేంద్రం నుండి కోరివేణిగూడెంకు వెళ్లే రహదారికి ఇరువైపులా విపరీతంగా కంప చెట్లు పెరిగి, ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారాయని మండల ప్రజలు వాపోతున్నారు.
రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు( Trees ) ఎక్కువగా ఉండడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, ప్రమాదాలు జరుగుతున్నాయని,ఈ దారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుందని,కోరివేణిగూడెం, ఆంజనేయతండా,పేరూరు,మలిగిరెడ్డిగూడెం,శిల్కాపురం గ్రామాల వాళ్ళు ఈ దారి గుండానే మండల కేంద్రమైన తిరుమలగిరికి రావాల్సి ఉంటుందన్నారు.
ఇప్పటికైనా సంబధిత ఉన్నతాధికారు స్పందించి, ప్రజల ప్రాణాలకు హని జరగకముందే చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు.