నల్లగొండ జిల్లా:కేతేపల్లి మండల వ్యాప్తంగా గృహలక్ష్మి( Gruha Lakshmi Scheme ) లబ్ధిదారుల ఎంపికలో గోల్ మాల్ జరిగిందని కేతేపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.గురువారం కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకొస్తే స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా అనర్హులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు గృహలక్ష్మి ఇండ్ల పట్టాల పంపిణీ చేశారన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య( MLA Chirumurthy ) ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇతర పార్టీల వారిని బెదిరిస్తూ గులాబీ కండువా వేసుకుంటేనే గృహలక్ష్మి,ఇతర పథకాలు వస్తాయని ప్రలోభపెట్టి, మాట వినని వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
గృహలక్ష్మి పథకం దరఖాస్తులను అధికారులతో ఎంక్వయిరీ చేయకుండా ఎమ్మెల్యే తమకు నచ్చిన వారి పార్టీ వారికి వర్తింపచేయడంచట్ట విరుద్ధమన్నారు.
ప్రభుత్వ పథకాలే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ( BRS PARTY )కి పాడే కడతాయని,ప్రజలు సరియైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కేతేపల్లిఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్, మాజీ జెడ్పిటిసి జట్టంగి వెంకటనర్సయ్య యాదవ్, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి అంజన్ యాదవ్, బొప్పారం గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గం నాగేంద్రబాబు,ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు
.