నల్లగొండ జిల్లా:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం ఏఐసీసీ పక్క ప్రణాళికతో వెళ్తుంది.అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ మంత్రి,ప్రస్తుత భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది.
ఈ సందర్భంగా సోనియాగాంధీ,రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపిన కోమటిరెడ్డి,ఏఐసీసీ తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా చేస్తూ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కృషి చేస్తానని చెప్పారు.
*కోమటిరెడ్డి కామెంట్స్*
ఆదివారం నల్లగొండ పట్టణం రామగిరి రామాలయంలో పూజలు చేస్తుండగా ఈ వార్త నాకు తెలిసింది.
ఈరోజు రామన్నపేట మండలంలోని సురారం, బాచుపల్లి,సిరిపురం గ్రామాల్లోని రామాలయలలో సీతారాముల కల్యాణ మహోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.శ్రీరామ నవమి నాడు నన్ను నియమించడం సంతోషంగా ఉంది.
ఆ భగవంతుని దీవెనలతోనే నాకు ఈ పదవి వచ్చింది.ఇప్పటి వరకు నల్లగొండకి మాత్రమే నా పోరాటం పరిమితం చేశాను.
ఏఐసీసీ నాకు ఈ బాధ్యతలు అప్పగించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా.కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండకడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లక్ష్యంగా ముందుకెళ్తా.
తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైంది.కాంగ్రెస్ హయాంలో దళితులకు భూమి ఇస్తే కేసీఆర్ ఆ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ కి ధారాదత్తం చేస్తున్నాడు.నీళ్లు,నిధులు,నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు.2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా భర్తీ చేయలేని అసమర్థ యంత్రంగం ఉంది.కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడు.కేజీ టూ పిజి ఉచిత విద్య,3 ఎకరాల భూమి,దళిత బంధు,రైతుబంధు అని ఇలా ఎన్నో అబద్దాలు చెప్పుతున్నాడు.రైతు బంధు అని అంటున్న కేసీఆర్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచేశారు.మీరిచ్చే రైతు బంధు ఎరువులు కొనటానికే సరిపోవటం లేదు.
రాష్ట్రంలో కౌలు రైతుల బ్రతుకు దారుణంగా ఉంది.రైతు బంధు యజమాని ఖాతాలోకి వెళ్తే కౌలు రైతు అప్పు చేసి పంట వేస్తున్నారు.
మీ రైతు బంధు ఎవరికి మేలు చేయటానికి.అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా అప్ఫల పాలు అయ్యేది కౌలు రైతు,చనిపోయేది కౌలు రైతు.
దేశంలో ఎక్కడైనా పంట పండించే వారిని ప్రభుత్వాలు ఆదుకుంటాయి కానీ,ఇక్కడ భూస్వాములను ఆదుకుంటున్నాడు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం పార్టీ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాం.
ప్రాథమిక విద్య,వైద్యం మరియు ఉద్యోగాలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చెందేలా మేము కార్యక్రమాలను చేపడతాం.కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా నాశనం చేస్తున్నాడో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు అర్థం అయ్యేలా వివరిస్తా.
శక్తి వంఛనాలేకుండా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేస్తా.