రాజ్యాంగం గ్రంధాన్ని ప్రతి పౌరునికి ఉచితంగా ఇవ్వాలని వినతిపత్రం

నలగొండ జిల్లా: భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రతి పౌరునికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో మరియు భారత రాజ్యాంగ పుస్తకాలను ఇంటింటికి, ప్రతి పౌరుడికి ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మసమాజ్ పార్టీ నల్లగొండ జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు జగన్ మహారాజ్ డిమాండ్ చేశారు.సోమవారం గుర్రంపోడు మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం గ్రంధాన్ని ప్రతి పౌరునికి ఉచితంగా పంపిణీ చేయాలని మండల తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.

 A Petition To Give Free Copy Of The Constitution To Every Citizen, Indian Consti-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ 33 జిల్లాల కలెక్టర్లకు మే 2న విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం స్పందించని యెడల ధర్నాలు నిర్వహించి, రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ సభ్యులు గిరి మహారాజ్,భిక్షం, కొండల్,మహిళ నాయకురాలు మహేశ్వరి, శోభన్,విజయ శంకర్, మహారాజ్,శంకర్,గిరి సర్కిల్ కో ఇంచార్జ్ సుమన్ మహారాజ్,నాగరాజు మరియు బీసీ,ఎస్సీ,ఎస్టీ నాయకులు,ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube