నల్లగొండ జిల్లా: నల్లగొండ టూటౌన్ ఎస్సైగా జి.మానస శనివారం బాధ్యతలు చేపట్టారు.
ఈమె 2018లో ఎస్సైగా సెలక్టయ్యారు.ప్రస్తుతం పోలీస్ జిల్లా కేంద్ర కార్యాలయంలో త్రిబుల్స్ ఎస్లో ఎస్సైగా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ఆమె నల్లగొండ టూ టౌన్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై జి.మానస మాట్లాడుతూ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు.
పట్టణ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా తనను ఆశ్రయిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఎస్ హెచ్ ఓ నాగరాజు ఆధ్వర్యంలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.ఉన్నతాధికారుల సహకారంతో పని చేస్తానని తెలిపారు.