వసతి గృహాల్లో ఉండని వార్డెన్లు...ఇబ్బందుల్లో విద్యార్థినిలు...!

నల్లగొండ జిల్లా:సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్లు స్థానిక ఉండకపోవడంతో విద్యార్థినిలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అన్నారు.గురువారం నల్లగొండ జిల్లా అనుముల మండలం హాలియా పట్టణంలోని ఎస్సీ,బీసీ గర్ల్స్ హాస్టల్స్ లో సమగ్ర సర్వే నిర్వహించారు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ హాస్టల్ అధ్యయన యాత్రలో భాగంగా హాస్టల్స్ ను సందర్శించారు.

 Wardens Who Do Not Stay In Hostels Are Students In Trouble , Kondeti Srinu, Host-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డెన్లు స్థానికంగా ఉండటం లేదని వారానికి 2,3 రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని,హాస్టల్లో కరెంటు పోతే ఇన్వర్టర్ లేక చదువుకోడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, పాములు,తేళ్లు హాస్టల్ లోపలికి వస్తున్నాయని విద్యార్థినిలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.హాస్టల్లో మొత్తం విద్యార్థులు 70 మంది ఉంటే,రెగ్యులర్ గా 30 మంది మాత్రమే ఉంటున్నారని,మెనూ సక్రమంగా అమలు చేయట్లేదని,రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి కొత్త దొడ్డు బియ్యం ఇస్తున్నారని,కొత్త దొడ్డు బియ్యంతో భోజనం, కిచిడి,వండితే ముద్దుల ముద్దలు కావడం,నీళ్ల చారు,నీళ్ల కూరలతో విద్యార్థులు కడుపునిండా తినలేక పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్లో ఉదయం పూట పెట్టాల్సిన టిఫిన్ బదులు ప్రతిరోజు రైసు పెడుతున్నారని,ఇడ్లీ వడ పూరి,దోశ వంటి టిఫిన్ పెట్టాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు కనుగుణంగా మెస్ చార్జీలు రూ.1500 నుండి రూ.2500 లకు పెంచి,ప్యాకెట్ మనీ రూ.1000 పెంచాలని డిమాండ్ చేశారు.హాస్టల్ ప్రారంభించి నెల రోజులు పూర్తవుతున్నా నేటికీ నోట్ బుక్స్,బట్టలు, దుప్పట్లు,ప్లేట్లు,గ్లాసులు ఇవ్వలేదని,విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ ప్రభుత్వం అందించాలని,విద్యార్థినిలకు ప్రభుత్వ డాక్టర్ రెగ్యులర్ గా మెడికల్ చెక్ అప్ చేయాలని జీవో ఉన్నా అది అమలు కవడం లేదని,జ్వరం వచ్చినా, కడుపునొప్పి లేచినా అనారోగ్యం పాలైనా పట్టించుకునే నాథుడే లేడన్నారు.

ప్రభుత్వం ప్రతి హాస్టల్లో ఆట వస్తువులు, లైబ్రరీ,దినపత్రికలు అందుబాటులో ఉంచి,అన్ని తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేయాలని, ఉన్నత అధికారులు రెగ్యులర్ గా హాస్టల్లను సందర్శించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల అధ్యక్షులు కొమ్ము జీవన్,విద్యార్థినిలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube