ఎలుకల బెడద. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది.
ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కడ లేని ఎలుకలు ఇంట్లోకి వచ్చి చేరతాయి.ఈ ఎలుకలు బట్టలు కొరికేయడం, ధాన్యాన్ని నాశనం చేయడం ఇలా ఇంట్లోని వస్తువులన్నీ నాశనం చేసేస్తుంటాయి.
ఇళ్లు గుల్ల చేసే ఎలుకలను ఎలా నతరిమికొట్టాలో తెలియక తెగ సత మత మవుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.
చాలా సులువుగా ఎలుకలను బయటకు పంపొచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
సాధారణంగా ఉల్లిపాయ వాసన అంటే ఎలుకలకు గిట్టనే గిట్టదు.ఉల్లిపాయలు ఉన్న చోటకు ఎలుకలు రావు.అందుకే ఇంట్లో చిన్న చిన్న కన్నాలు ఉన్న చోట ఉల్లిపాయలను చీల్చి పెట్టాలి.దాంతో ఎలుకలు రాకుండా ఉంటాయి.
ఉల్లే కాదు వెల్లుల్లి వాసనను కూడా ఎలుకలు తట్టుకోలేదు.కాబట్టి, ఉల్లికి బదులుగా వెల్లుల్లి రెబ్బలను తురిమి కూడా వేయవచ్చు.
అలాగే బంగాళదుంపలను ముక్కలుగా కట్ చేసి ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ బంగాళదుంపల పొడిని ఇంటి నలువైపుల, కన్నాల దగ్గర, తలుపులు, కిటికీల వద్ద చల్లాలి.
ఇలా చేసినా ఎలుకలు రాకుండా ఉంటాయి.ఇంట్లో ఉండే ఎలుకలు పరార్ అవుతాయి.
కొన్ని మిరియాలు మరియు కొన్ని లవంగాలు తీసుకుని మెత్తగా పొడి చేయాలి.ఆ తర్వాత ఎలుకలు ప్రవేశించే మార్గంలో ఈ పొడిని చల్లడం వల్ల.ఆ ఘాటు వాసనకు ఎలుకలు దరి దాపుల్లోకి కూడా రాకుండా ఉంటాయి.
ఎలుకలను తరిమి కొట్టడంలో కారం కూడా అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక క్లాత్ తీసుకుని అందులో కొద్దిగా కారం వేసి మూట కట్టాలి.ఇప్పుడు ఎలుకలు తరచూ వచ్చే ప్రాంతంలో పెట్టండి.
ఆ కారం వాసనకు ఎలుకలు రానే రావు.ఇక ఇంట్లో అప్పుడప్పుడూ ఎండు మిర్చిలను కాల్చాలి.
తద్వారా ఎలుకలు ఉంటే ఆ ఘాటు వాసనకు పారిపోతాయి.