ధరల పెంపును నిరసిస్తూ కదం తొక్కిన కాంగ్రేస్ శ్రేణులు

నల్లగొండ జిల్లా:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో సామాన్యుని నడ్డి విరుచేలా పెంచిన పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్,విద్యుత్,ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రేస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించి,వినతిపత్రం సమర్పించారు.

 The Congress Ranks Rallied To Protest The Price Hike-TeluguStop.com

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు.వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు వాహనాలు నడిపే పరిస్థితి లేదన్నారు.

అదేవిధంగా ఇటీవల కరోనా కారణాలతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపైన విద్యుత్ చార్జీలు,ఆర్టీసీ చార్జీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం మరింత భారం మోపుతుందన్నారు.పెరిగిన డీజిల్,పెట్రోల్ ధరలు, విద్యుత్,ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

పెరిగిన ధరలు,చార్జీలు తగ్గించకుంటే రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలిచి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి,ముదిరెడ్డి నర్సిరెడ్డి,దేశిడి శేఖర్ రెడ్డి,మహబూబ్ అలీ,రవి నాయక్,వెంకటేష్ గౌడ్,సలీం,తమ్ముడుబోయిన అర్జున్,క్రికెటర్ జానీ, లింగయ్య యాదవ్,అజహరుద్దీన్,ఇమ్రాన్,చిలుకూరి బాలు,కొమ్ము శ్రీనివాస్ గంధం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube