నల్లగొండ జిల్లా: తెలంగాణ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీఎస్పీ తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురువారం సాయంత్రం విడుదల చేశారు.శుక్రవారం నామినేషన్ల ప్రక్రియకు తుది గడువు కావడంతో 20 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు.
ఈ జాబితాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిగిలిన ఐదు స్థానాలకు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది.టిక్కెట్ దక్కించుకున్న అభ్యర్దులు వీరే… నాగార్జునసాగర్ – రమణ ముదిరాజ్, మిర్యాలగూడ – డా.జాడి రాజు, భువనగిరి -ఉప్పల జహంగీర్, తుంగతుర్తి – బొడ్డు కిరణ్, ఆలేరు – డప్పు వీరస్వామి.