కామినేని గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలపై ఈడీ సోదాలు...!

నల్లగొండ జిల్లా: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి.ఇటీవలే పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాలపై దాడులను ఈడీ నిర్వహించిన విషయం తెలిసిందే.

 Ed Raids On Residences Of Kamineni Group Chairman And Md, Ed Raids , Kamineni G-TeluguStop.com

వారిని విచారణకు సైతం రమ్మంటూ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.కామినేని గ్రూప్‌పై బుధవారం ఉదయం నుండి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

కామినేని గ్రూప్ చైర్మన్,ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి.

తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో సైతం సోదాలు జరుగుతున్నాయి.అలాగే మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

షామీర్‌పేటలోని మెడిసిటీ కళాశాలలో ఏరియా అధికారులు సోదాలు చేస్తున్నారు.

అలాగే ఫిల్మ్ నగర్ లోని ప్రతిమా కార్పొరేట్ కార్యాలయంపై సోదాలు నిర్వహిస్తోంది.

ఈడీ అధికారులు రెండు టీమ్స్‌గా విడిపోయి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రతిమా గ్రూప్‌కి చెందిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నిస్తున్నారు.

నేడు బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా వెళ్లారు.భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో ఈడీ బృందాలు బయలుదేరాయి.హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube