ఖాళీ కడుపుతో తినదగ్గ ఐదు బెస్ట్ అండ్ హెల్తీ ఫుడ్స్ ఇవే!

సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో ఏం తినాలి.? ఏం తినకూడదు.? అన్న అవగాహన చాలా మందికి ఉండదు.ఎక్కువ మంది ఇడ్లీ, పూరి, చపాతీ, దోసె, బ్రెడ్, బజ్జీ వంటివి తింటుంటారు.

 These Are The Five Best And Healthy Foods To Eat On An Empty Stomach! Healthy Fo-TeluguStop.com

వీటి వల్ల మీకు ఆకలి తీరుతుంది తప్పితే.మరెలాంటి ప్రయోజనాలు ఉండవు.

అందుకే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఖాళీ కడుపుతో తినదగ్గ ఐదు బెస్ట్ అండ్ హెల్తీ ఫుడ్స్( Healthy foods ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Foods, Dates, Empty Stomach, Tips, Healthy Foods, Latest, Nuts, Papaya, W

ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం, వాల్ నట్స్ ను మీరు తీసుకోవచ్చు.వీటిలో ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మారుస్తాయి.రోజంతా ఉత్సాహంగా ఉండేలా ప్రోత్సహించాలి.అలాగే ఖాళీ కడుపుతో క్యారెట్, బీట్ రూట్ జ్యూసులు( Carrot juice ) మరియు గ్రీన్ వెజిటేబుల్ జ్యూసులు తీసుకోవచ్చు.ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మనకు అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ ను చేకూరుస్తాయి.

Telugu Foods, Dates, Empty Stomach, Tips, Healthy Foods, Latest, Nuts, Papaya, W

ఖాళీ కడుపుతో తినదగ్గ ఉత్తమమైన ఆహారాల్లో ఖర్జూరాలు ఒకటి.నిత్యం మూడు నాలుగు ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

మరియు బీపీ కంట్రోల్ లో ఉంటుంది.అలాగే మీరు ఖాళీ కడుపుతో పుచ్చకాయను కూడా తీసుకోవచ్చు.

పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచ‌డానికి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అదే సమయంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

ఇక‌ ఖాళీ కడుపుతో మీరు బొప్పాయి పండును కూడా తిన‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.బొప్పాయి పండు రుచిగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.

ఖాళీ కడుపుతో బొప్పాయి పండు ముక్క‌లు ( Papaya )తింటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మలినాలు బయటకు పోతాయి.మరియు పేగు కదలికలు మెరుగుపడతాయి.

మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube