సిఎంఆర్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

నల్లగొండ జిల్లా: రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు.బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో రైస్ మిల్లర్లతో 2023-24 వానాకాలం,యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ పై సమీక్షించారు.2023-24 వానకాలానికి సంబంధించిన సీఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.కాగా జిల్లాలో వానకాలంలో మిల్లర్లకు ప్రభుత్వం 3,22,754 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవ్వగా, 216816 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో ఇవ్వాల్సి ఉంది.

 Cmr Target Should Be Completed Immediately District Collector Dasari Harichandan-TeluguStop.com

ఇందుకుగాను మిల్లర్లు లక్ష4 వేల451 మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…తక్కిన 1,16,365 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ను సైతం వెంటనే చెల్లించాలని,ఇందుకుగాను సీఎంఆర్ చెల్లించే విధానాన్ని వేగవంతం చేయాలన్నారు.కొందరు మిల్లర్లు 40 శాతం కన్నా తక్కువగా ఉన్నారని అలాంటివారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి త్వరితగతన చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.15 రోజుల్లో పురోగతి కనిపించాలన్నారు.సీఎంఆర్ విషయంలో మిల్లర్లు సీరియస్ గా ఉండాలన్నారు.2023-24 యాసంగికి సంబంధించి ఇప్పటివరకు మిల్లర్లు 29812 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారని, తక్కినది సైతం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మిల్లర్లను ఆదేశించారు.యాసంగి సిఎంఆర్ ను వేగవంతం చేయాలన్నారు.

మిల్లర్ల ప్రతినిధులు మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు సీఎంఆర్ డెలివరీని ఎక్కువ మొత్తంలో చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎఫ్ సి ఐ జిల్లా మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్,ఎఫ్ సి ఐ మేనేజర్ శ్రీనివాస్,జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నాగేశ్వరరావు,జిల్లా పౌర సరఫరాల ఆధికారి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube