విద్యార్థి,యువకులు జార్జ్ స్పూర్తిని ఎత్తిపట్టండి: పి.డి.ఎస్.యూ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దుబ్బ మధు

నల్లగొండ జిల్లా:1970 దశకంలో ఉస్మానియా వర్శిటీ యవనికపై ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రతి విద్యార్థిలో సమతా భావాలు వికసించేలా,ఆత్మగౌరవ బావుటా ఎగరవేసిన ధ్రువతార,ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి అని పి.డి.

 Student, Youth Lift George's Inspiration: Pdsu State Leaders Comrade Dubba M-TeluguStop.com

ఎస్.యూ.రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దుబ్బ మధు అన్నారు.గురువారం నకిరేకల్ పట్టణంలో పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిర్వహించిన జార్జిరెడ్డి 50 వర్దంతి వారోత్సవాల సభకు ఆయన హాజరై మాట్లాడాతూ నక్సల్బరీ వెలుగులోని సాయుధ యుద్ధ పంథా మాత్రమే దేశప్రజలకు సమతా స్వాతంత్ర్యాలు అందిస్తుందని నమ్మి,ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి,విద్యార్థులని ముందుకు నడిపించిన యోధుడు కామ్రేడ్ జార్జిరెడ్డి అని కొనియాడారు.జార్జి తెగువ ముందు తట్టుకోలేని రాజ్యం,మతోన్మాదం మూకుమ్మడిగా దాడి చేసి 1972 ఏప్రిల్ 14 న యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ పరిధిలోని కిన్నెర హాస్టల్ ముందు దారుణంగా హత్య చేసి తమ పాశవికతను చాటుకున్నాయని గుర్తు చేశారు.

నేటికి సరిగ్గా జార్జి మరణించి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా నకిరేకల్ పట్టణంలో జార్జిరెడ్డి వారోత్సవాల సభ జరపబడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఆయన ఆశయాలను తెలుపడమేనని పేర్కొన్నారు.జార్జిరెడ్డి పైన వచ్చిన డాక్యుమెంట్లు,సినిమాలు జార్జిరెడ్డిని మరింత సజీవం చేస్తున్న ఈ తరుణంలో జార్జి రాజకీయాలను ఎత్తిపట్టి,విప్లవ విద్యార్థి ఉద్యమానికి బలం చేకూర్చాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

ఏప్రిల్ 14 న జార్జిరెడ్డి మిత్రుల ఆధ్వర్యంలో ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మార్నింగ్ వాక్లో,సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభా కార్యక్రమంలో విద్యార్థులు మేధావులు,ప్రజలు,ప్రగతిశీలవాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి.

డి.ఎస్.యూ) నాయకులు దుర్గం ప్రసాద్,గంగాధరి వెంకన్న,జిల్లా సంతోష్,దుర్గం గణేష్,పర్వతం చందు,నాగరాజు, శంకర్,నవీన్,మహేష్,ఆజాద్,జార్జి,శ్రావణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube