చంద్రగ్రహణంపై మూఢ నమ్మకాలు వీడండి

నల్లగొండ జిల్లా:చంద్రగ్రహణం సందర్భంగా గరకపోసలు వేసుకోవడం,రోలులో రోకలి నిలబెట్టడం,గ్రహణం సమయంలో ఆహారము తీసుకోవద్దు,నీరు తాగొద్దు లాంటి అనేక మూఢనమ్మకాలను విడనాడాలని తెలియజేస్తూ సేవ్ స్వచ్ఛంద సంస్థ మరియు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ గ్రహణ సమయంలో చంద్ర గ్రహణాన్ని వీక్షించడంతోపాటు,ప్రజలు పాటించే మూఢనమ్మకాలైన రోలులో రోకలి నిల్చోపెట్టడ్డాన్ని ప్రదర్శించి దానిలోని శాస్త్రీయ కారణాలను వివరించడం జరిగింది.

 Let Go Of Superstitious Beliefs About Lunar Eclipse-TeluguStop.com

గ్రహణ సమయంలో అల్పాహారాన్ని తీసుకోవడం,పానీయాలు స్వీకరించడం చేసి చూపించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు,జనవిజ్ఞాన వేదిక పూర్వ జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల నవీన్ రెడ్డి,గంట నర్సిరెడ్డి,నామ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రగ్రహణం అనేది ఖగోళంలో సంభవించే అద్భుతమైన దృగ్విషయమని,దీనిని ప్రతి ఒక్కరు చూడాలని తెలియజేశారు.

గ్రహణం సమయంలో ప్రజలకు ఎలాంటి చెడు జరగదని భయపడవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి, బి.పరిపూర్ణా చారి,బి.ఇంద్రా రాణి,ఎల్.

స్వాతి,పద్మ, హరిణి,శాంతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube