నల్లగొండ జిల్లా:చంద్రగ్రహణం సందర్భంగా గరకపోసలు వేసుకోవడం,రోలులో రోకలి నిలబెట్టడం,గ్రహణం సమయంలో ఆహారము తీసుకోవద్దు,నీరు తాగొద్దు లాంటి అనేక మూఢనమ్మకాలను విడనాడాలని తెలియజేస్తూ సేవ్ స్వచ్ఛంద సంస్థ మరియు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ గ్రహణ సమయంలో చంద్ర గ్రహణాన్ని వీక్షించడంతోపాటు,ప్రజలు పాటించే మూఢనమ్మకాలైన రోలులో రోకలి నిల్చోపెట్టడ్డాన్ని ప్రదర్శించి దానిలోని శాస్త్రీయ కారణాలను వివరించడం జరిగింది.
గ్రహణ సమయంలో అల్పాహారాన్ని తీసుకోవడం,పానీయాలు స్వీకరించడం చేసి చూపించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు,జనవిజ్ఞాన వేదిక పూర్వ జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల నవీన్ రెడ్డి,గంట నర్సిరెడ్డి,నామ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రగ్రహణం అనేది ఖగోళంలో సంభవించే అద్భుతమైన దృగ్విషయమని,దీనిని ప్రతి ఒక్కరు చూడాలని తెలియజేశారు.
గ్రహణం సమయంలో ప్రజలకు ఎలాంటి చెడు జరగదని భయపడవద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కనుకుంట్ల ఉమారాణి, బి.