శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి( Gutta Amith Reddy ) బీఆర్ఎస్ పార్టీని వీడి సోమవారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాగా,గత అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు.టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసినా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ కేటాయించారు.
అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.తన తాత గుత్తా వెంట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించి గత కొంతకాలంగా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి పట్టు సాధించారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించారు.కానీ,ఆ కోరిక నెరవేరలేదు.
దీనితో గులాబీ పార్టీకి గుడ్ చెప్పారు.