నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ ( Miryalaguda )పరిధిలోని మాడుగులపల్లి టోల్గేట్ వద్ద సోమవారం విఓఏలు మెరుపు ధర్నాకు దిగడంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
వివోఏలతో( VOAs ) ధర్నాకు సీపీఎం నేత,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి( Julakanti Ranga Reddy ) మద్దతు ప్రకటించారు.
గత 44 రోజులుగా డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న వివోఏలు సోమవారం హైదరాబాదు లోని ఇందిరా పార్కు వద్ద రాష్ట్రస్థాయి సమావేశం మరియు ధర్నాకు వెళ్తున్న క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో మెరుపు ధర్నా,రాస్తారోకో చేపట్టారు.మిర్యాలగూడ డివిజన్ కి చెందిన వివోఏలను పోలీసులు మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద అడ్డగించడంతో ధర్నాకు దిగినట్లు తెలిసింది.
ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు నిరసన విరమింప చేసేందుకు పోలీసులు వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.