నల్లగొండ జిల్లా/న్యూ ఢిల్లీ:భారత సైన్యంలో ప్రవేశపెట్టనున్న అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సత్యాగ్రహ కార్యక్రమానికి హాజరై విద్యార్థులు,యువకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ అగ్ర నాయకులు ప్రియాంక గాంధీ,కేసీ.
వేణుగోపాల్,జైరామ్ రమేష్,అదిర్ రంజన్ చౌదరి, సచిన్ పైలెట్,దీపేందర్ హూడాతో కలిసి మాజీ టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంటు సభ్యుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భద్రత విషయంలో రాజీ పడుతున్న అగ్నిపథ్ పథకాన్ని అమలు చేయకుండా తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సైన్యంలో గౌరవప్రదంగా,హుందాగా పని చేయాలని ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువకులకు ఈ పథకం అన్యాయం చేస్తుందన్నారు.ప్రభుత్వ నిర్ణయంతో యువత తాము మోసపోయామని భావిస్తున్నారని, అందుకే దేశ వ్యాప్తంగా అగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయని,బీజేపీ ప్రభుత్వం దీని నుండి వెనక్కు రాక తప్పదని చెప్పారు.