లోకల్ నాన్లోకల్ వార్ మునుగోడును ముంచేనా?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఏ నలుగురు కలిసినా మునుగోడు బై పోల్ పైనే చర్చ జరుగుతోంది.ఎవరు గెలుస్తారు? ఓటుకు ఎంతిస్తున్నారు? ఎవరి సత్తా ఎంత? ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి.2023 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి.మునుగోడులో గెలిచి వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.పావులు కదుపుతూ ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతలు మకాం వేశారు.

 Will Local Nonlocal War Sink Munugoda?-TeluguStop.com

ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు.ఇక ఈ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ విజయ సాధించాలని పట్టుదలతో ఉన్నారు.

అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలను ఉప ఎన్నిక రంగలోకి దింపారు.నియోజకవర్గంలో మొత్తం 86 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వాటిని 86 క్లస్టర్లుగా విభజించారు.

ఒక ఎంపీటీసీ స్థానానికి ఓ ఎమ్మెల్యే,లేదా మంత్రి ఇంఛార్జి ఉంటారన్న మాట.అంతెందుకు గులాబీ బాస్ కేసీఆర్ కూడా నియోజకవర్గంలోని లంకలపల్లి గ్రామానికి ఇంఛార్జ్ వ్యవహరిస్తున్నారు.మంత్రులు, ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన గ్రామాల పరిధిలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే వచ్చినట్లు తెలుస్తోంది.గ్రామాలకు ఇంఛార్జ్లుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు తమతోపాటు తమ అనుచరులను భారీగా నియోజవర్గానికి తరలించారు.వారు గ్రామాల్లోని స్థానిక నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

బూత్ లుగా విడగొట్టి ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున మంత్రులు,ఎమ్మెల్యేలతో పాటు వచ్చిన కీలక నేతలు మళ్లీ ఇంఛార్జ్ గా వ్యవహరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.అయితే ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు పంపిణీ జరగనుందనే టాక్ మాత్రమ్ వినిపిస్తోంది.

దీంతో ఆ డబ్బు పంపిణీ కూడా మంత్రులు,ఎమ్మెల్యే వెంట వచ్చిన కీలక నేతల ద్వారానే జరగనుందని ప్రచారం.ఇది స్థానిక నేతలకు మింగుడు పడటం లేదు.

తాము ప్రచారానికే పరిమితమవుతున్నామే తప్ప తగిన ‘ప్రాధాన్యం’దక్కటం లేదని సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.బయటి వారికే ప్రాధాన్యం ఇస్తూ తమను ప్రచార బొమ్మలుగానే చూస్తున్నారని స్థానిక నేతలు మనోవేదనకు గురవుతున్నట్లు సమాచారం.

దీంతో టీఆర్ఎస్ పార్టీలో లోకల్, నాన్ లోకల్ వార్ మొదలై పరస్పర సహకారం కొరవడుతుందన్న టాక్ వినిపిస్తోంది.పోలింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలో చీలికలు వస్తే గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్ బైపోల్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని, అందువల్లే ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందని టీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం.ఇలాగే పోలింగ్ వరకు కొనసాగితే హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని వారు ఆందోళనకు గురువుతున్నట్లు తెలుస్తోంది.

దీనికి చెక్ పెట్టి పార్టీ కేడర్ మధ్య సమన్వయం కుదిర్చే పనిలో టీఆర్ఎస్ మంత్రులు,ఎమ్మెల్యేలు నిమగ్నమైనట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube