మంత్రి కోమటిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి: బిజెవైయం

నల్లగొండ జిల్లా:బీజేపీ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బిజెవైయం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వంగూరి రాఖి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది వెంకట్ రెడ్డితో మరియు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 Minister Komatireddy Should Take Back Inappropriate Comments: Bjv-TeluguStop.com

కోమటిరెడ్డి వెంకటరెడ్డి డబ్బు అహంకారం చూపిస్తేనే నల్లగొండ అసెంబ్లీ ప్రజలు గతంలో ఓడించారని,మళ్లీ దొంగ హామీలిచ్చి,ఆరు దొంగ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని తెచ్చుకున్నారన్నారు.

ఇప్పుడు అధికార అహంతో భారతీయ జనతా పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతోని అందుబాటులో ఉండి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy )కి సహకరించింది వాస్తవమా కాదా? అని ప్రశ్నించారు.ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జనతా పార్టీకి ఒక కోవర్ట్ గా మరియు హోంగార్డుగా అభివర్ణిచారని,కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నాడని మునుగోడులో జరిగిన సభలో ఘాటుగా విమర్శించాడని గుర్తు చేశారు.

ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులతో అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలం,బలగాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరుతానని జాతీయ నాయకులకు హామీ ఇచ్చింది వాస్తవమా కాదా ? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు,రైతుల సమస్యలు పక్కనపెట్టి ఇతర పార్టీల మీద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందుబాటులో ఉన్నారని విమర్శ చేయడం తగదన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు పథకాలు నల్గొండ జిల్లా ప్రజలకు అందేవిధంగా చూడాలని,చేయాలి లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారతీయ జనతా యువ మోర్చా నల్గొండ జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి బస్మాసుర హస్తంలా మారుతుందనిజోస్యం చెప్పారు.

ఇలాంటి అర్ధంలేని వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు.ఈ కార్యక్రమంలో బిజెవైయం సెక్రటరీ శాంతి స్వరూప్, బుడుగ భరత్,నగర అధ్యక్షుడు దుబ్బాక సాయి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube