కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని,బడుగు,బలహీన వర్గాలు రాజ్యాధికారానికి మరింత దూరమయ్యారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ( MRPS Chief Manda Krishna Madiga ) అన్నారు.ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం( Miryalaguda Mandal ) సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణ వేడుకకు రాష్ట్ర రైతు ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి( Agros Chairman Vijayasimha Reddy ) తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాలు రాష్ట్ర సాధనలో ఉద్యమిస్తే,ప్రాణ త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణలో ఎవరు పాలకులుగా, ఎవరు బానిసలుగా మారారో అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) రెండు శాతం లేని వెలమల్లో నలుగురికి మంత్రులు,4 శాతం ఉన్న రెడ్లకు ఆరుగురు మినిస్టర్లు ఇచ్చారని,10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్కరికి మినిస్టర్ ఇవ్వలేదన్నారు.
బీసీలకు సైతం అన్యాయం జరుగుతుందన్నారు.ఏబీసీడి వర్గీకరణ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఖాసీం,అంబటి నాగయ్య, మట్టిమనిషి పాండురంగా రావు,కొమ్ము శ్రీనివాస్, మంద సైదులు,మంద శివ, నాగేష,రమేష్,సతీష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.