నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నేడు రంగుల కేళి హొలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.తెల్లవారు జామున నుండే యువతీ యువకులు పల్లె పట్నం అనే తేడా లేకుండా రంగుల్లో మునిగిపోయి,కేరింత కొడుతూ ఒకరికొకరు రంగులద్దుకుంటూ ఆనందోత్సాహాలలో తేలియాడుతున్నారు.
కొందరు డీజే నృత్యాలు చేస్తూ హోళిని మరింత సందడిగా మార్చేశారు.హోలీ వేడుకల సందర్భంగా కొందరు ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు హోలీ మామూళ్ళ పేరుతో డబ్బులు వసూళ్లు చేస్తూ రోడ్లపై వచ్చే వాహనదారులు ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.
హొలీ వేడుకల్లో పాల్గొన్న యువతీ యువకులకు,మహిళలు మాట్లాడుతూ మన జీవిత ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, మరేన్నో సంతోషాలు,ఎన్నో సమస్యలు,ఎన్నో బాధలు ఉంటాయని అవన్నీ ఉంటేనే జీవతమని,అలాగే అన్ని రంగులు కలిస్తేనే హోలీ అని సెలవిస్తున్నారు.హొలీ వేడుకకు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ ఈ ఒక్క రోజు అన్నీ మరిచిపోయి అందరూ సంతోషంగా సంబురాలు చేసుకోవడంతో అనాదిగా ఆచారంగా వస్తున్న సంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు.
ముఖ్యంగా రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని రంగులు చల్లుకొనే సమయంలో కళ్ళలో,చెవుల్లోకి,ముక్కులోకి వెళ్లకుండా చూసుకోవాలని,ప్రమోదం మాటున ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంటుందని,వాటి నుండి అప్రమత్తంగా ఉంటూ సంబురాలు సంతోషాలతో ముగించాలని కోరుకుందాం…
.