నల్లగొండ జిల్లా:బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.200 కోట్లు కేటాయించకుండా,కేవలం ట్రయల్ రన్ వేసి,నీటిని కొద్దిగా పోయించి,ప్రాజెక్టు పని పూర్తయ్యిందని చెప్పి, రైతులను మోసం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం సిధ్ధమౌతోందని ప్రజా పోరాట సమితి (పిఆర్ పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.సోమవారం పార్టీ ఆధ్వర్యంలో నార్కెట్‌పల్లి తహసిల్దార్ ఆఫీస్ ముందు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈస్థితిలో ట్రయల్ రన్ చేయడం కాదని,టోటల్ వర్క్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసిలో ఆగిన 10 కి.మీ.సొరంగమార్గం పూర్తికి రూ.1500 కోట్లు కేటాయించాలన్నారు.భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని,డిస్ట్రిబ్యూటరీ కాలువలను త్రవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సామ మాధవరెడ్డి,దొండ నరసింహ యాదవ్,బింగి రాములుయాదవ్,దొండ లింగస్వామియాదవ్, ఎన్నమళ్ళ పృథ్వీరాజ్, కప్పల రాకేష్ గౌడ్,మేడి నరసింహ,జిల్లా నరేష్, మాగి మహేష్,నిమ్మనగోటి అంజయ్య,మంటిపల్లి స్వామియాదవ్,పంగ వెంకన్న,గుఱ్ఱం రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.