నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూర్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జి,ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,ఎమ్మెల్సీ సారయ్య తెలిపారు.శనివారం చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బంగారి గడ్డ వద్ద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు.
పార్కింగ్ కోసం మండలాల వారిగా వేరు వేరుగా ఏర్పాట్లు చేసామని,ముఖ్యమంత్రి వస్తున్నారని అనగానే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తుందన్నారు.మునుగోడు ఉప ఎన్నిక వెనుక ఆంతర్యం వేరే ఉందని,18 వెల కోట్లు కాంట్రాక్టు తీసుకొని రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడని,కేసీఆర్ బీఎస్ఆర్ పెట్టగానే బీజేపీ ఉలిక్కిపడుతున్నదన్నారు.
బీజేపీ పీఠాలు కదిలిపోతున్నాయ్ అని, తెలంగాణ మోడల్ దేశం యావత్తు కావాలని డిమాండ్లు వస్తుంటే బీజేపీ వాళ్లకు నిద్ర పట్టడం లేదన్నారు.అందుకే ముఖ్యమంత్రిని తెలంగాణ వరకే పరిమితం చేయాలని ఉప ఎన్నిక తెచ్చారని, మునుగోడులో వందల కోట్లను గుప్పిస్తూ నాయకులను కొంటూ జగుప్సాకరంగా బీజేపీ వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ పాలనను అంతం చేయాలని మోడీ,అమిత్ షా దుష్ట ద్వయం కుట్రలు చేశారని,అమిత్ షా మునుగోడుకు వచ్చి చెప్పారన్నారు.రాజగోపాల్ రెడ్డి చేరికతో కేసీఆర్ ప్రభుత్వం పడి పోతుందని అన్నారని,అన్నదాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యేలను కొనాలని ప్రలోభాలు పెట్టారని పేర్కొన్నారు.
బండి సంజయ్ అనే వాడు చిల్లరగాడని,యాదాద్రి పోయి నానా హంగామా చేసి, అభాసుపాలయ్యాడని,బీజేపీ భాగోతంపై వీడియోలు,ఆడియోలు బయటికి వస్తున్నాయని,ఆధారాలు పక్కా ఉన్నాయని,ఇంత పెద్ద కుట్ర చేసి,బీజేపీ వాళ్ళు తేలుకుట్టిన దొంగల్లా వున్నారని,ఇంత కుట్ర చేసి,మళ్ళీ దొంగల్లా భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు.నేడు జరిగే బహిరగసభలో ముఖ్యమంత్రి బీజేపీ బండారం బయట పెడతారని చెప్పారు.
అభివృద్ధిలో పోటీ పడలేక బీజేపీ దొంగచాటుగా దెబ్బతీయాలని కుట్ర చేశారని,అయినా మునుగోడులో విజయం టీఆర్ఎస్ దే అని ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ సారయ్య మాట్లడుతూ మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అని,సీఎం సభ ట్రెండ్ సెట్టర్ అవుతుందన్నారు.
సభకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని,మునుగోడులో సబ్బండ వర్గాలు ముఖ్యమంత్రి వెంటే వున్నారని తెలిపారు.నాగార్జున సాగర్,హుజుర్ నగర్ లాగానే మునుగోడులో కూడా టీఅర్ఎస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు.