నలగొండ జిల్లా:కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హతమార్చి గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసిన భార్య బాగుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఉస్మాన్ పుర కాలనీకి చెందిన జెడ్పీ స్కూల్ అటెండర్ మహమ్మద్ ఖలీల్ ను భార్య గత నెల 25న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
గుండెపోటు వల్లనే మరణించాడని భార్య కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది.ఒంటిపై గాయాలు ఉండటంతో అనుమానంతో మృతుని కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు.
శుక్రవారం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సాధారణ మరణం కాదని,హత్య చేశారని కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటికి వచ్చాయి.
దీనితో రంగంలోకి దిగిన పోలీసులు పిఎంఐ రిపోర్టు ఆధారంగా మృతుని భార్యను అదుపులో తీసుకొని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించింది.అయితే హత్య ఆమె ఒక్కతే చేసిందా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హత్య ఒకరి వల్ల కాదని, బయట వ్యక్తుల హస్తముందని,అక్రమ సంబంధం కోసమే హత్య చేసినట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.