నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ నేరగాళ్లు దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.ఎమ్మెల్యే వేముల వీరేశం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు.
ఆయన అకౌంట్లో నుండి ఫోటోలను సేకరించి,స్క్రీన్ రికార్డు పర్సనల్ వాట్సాప్ నెంబర్ కి పంపి బెదిరించడమే కాకుండా న్యూడ్ కాల్స్ తో ఎటాక్ చేసినట్లు తెలుస్తోంది.వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేదంటే డబ్బులు పంపిస్తావా అంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వాట్సాప్ చాటింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేకి బెదిరింపు మెసేజ్లు పంపడంతో అలర్ట్ ఎమ్మెల్యే ఈ వీడియో కాల్ సైబర్ మోసగాళ్లు చేస్తున్నారని పసిగట్టి పోలీసులను ఆశ్రయించినట్లు,పోలీసుల సూచనలతో సైబర్ నేరగాళ్ల నెంబర్ బ్లాక్ చేసినట్లు సమాచారం.