నల్లగొండ జిల్లా: దేవరకొండ నియోజకవర్గంలోని పీఏ పల్లి మండలంలో ఎక్కడ పోసిన వడ్ల రాశులు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయని,రైతులు ఎమ్మెల్యేను అడిగితే వారిపట్ల హేళనగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ అలుగుబెల్లి శోభారాణి అన్నారు.సోమవారం పీఏ పల్లి మండల కేంద్రంలోని అన్ని ఐకేపీ సెంటర్లను ఆమె సందర్శించి,పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మొన్న జరిగిన జడ్పీ జనరల్ బాడీ సమావేశంలో ఐకెపి సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని,పీఏ పల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేయాలని,
సిసిలో పోసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని,నెలరోజులు దాటిన వడ్లను కూడా చేయడం లేదని సీసీకి వ్యతిరేకంగా మిల్లర్లు తీసుకున్నటువంటి నాలుగు కిలోల తూకాన్ని అక్రమంగా మిల్లర్లు కటింగ్ చేస్తున్నారని తన దృష్టికి రావడంతో తాను ప్రజల తరఫున సమావేశంలో మాట్లాడితే మంత్రి జగదీష్ రెడ్డి అవి మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పాలని అనగా ఎమ్మెల్యేకు చెప్పినారని,గతంలో ఆయనను రైతులు అడ్డుకున్నారని చెప్పగా, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తాను ఇక్కడ ఉంటే అన్ని తెలిసేవని,హైదరాబాదు ఉంటే ఎలా తెలుస్తుందన్నారని తెలిపారు.నియోజకవర్గంలో 90 శాతం వడ్లు కొనుగోలు చేశామని సమావేశంలో చెప్పగా
ఇప్పటివరకు కేవలం సగం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశామని,ఇంకా సగం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని డీఎస్ఓ ఫోన్లో మాట్లాడారని చెప్పారు.
నాలుగైదు రోజుల్లో మండలంలోని మొత్తం వడ్లు మిల్లులకు తరలిస్తామని చెప్పినారని, కావాలని ఎమ్మెల్యే అందరి ముందు తన పరువు పోతుందని నాపై తప్పుడు ఆరోపణలు చేశాడన్నది.ఇప్పటికైనా మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సందర్శించి,ఇక్కడ ఉన్న రైతులకు ఆయనే సమాధానం చెప్పాలని లేనియెడల అందరి రైతులను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.