విక్టరీ రికార్డ్ వీరేశం...!

నల్లగొండ జిల్లా: ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ లో బ్యాలెట్ నుండే కాంగ్రెస్ బుల్లెట్ దింపడం స్టార్ట్ చేసిందనే చెప్పాలి.కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టేలా ఇచ్చిన ప్రజా తీర్పు నభూతో న భవిష్యత్ గా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.కానీ,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హస్తం హవా చూసి దేశమే నివ్వెరపోయింది.

 Congress Party Vemuma Veeresham Victory, Congress Party ,vemuma Veeresham , Nalg-TeluguStop.com

12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 గెలుసుకొని రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకుంటే అందులో నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి రాష్ట్రంలోనే అతి భారీ మెజార్టీతో “వీరేశం అంటే విక్టరీ ” అనే విధంగా 72 వేల మెజార్టీ సాధించి, గులాబీ పార్టీకి గూబ గుయ్యుమనెలా చేశాడని వేముల అభిమానులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube