విక్టరీ రికార్డ్ వీరేశం…!

నల్లగొండ జిల్లా: ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రిజల్ట్ లో బ్యాలెట్ నుండే కాంగ్రెస్ బుల్లెట్ దింపడం స్టార్ట్ చేసిందనే చెప్పాలి.

కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టేలా ఇచ్చిన ప్రజా తీర్పు నభూతో న భవిష్యత్ గా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కానీ,ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హస్తం హవా చూసి దేశమే నివ్వెరపోయింది.12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 గెలుసుకొని రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకుంటే అందులో నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి రాష్ట్రంలోనే అతి భారీ మెజార్టీతో "వీరేశం అంటే విక్టరీ " అనే విధంగా 72 వేల మెజార్టీ సాధించి, గులాబీ పార్టీకి గూబ గుయ్యుమనెలా చేశాడని వేముల అభిమానులు అంటున్నారు.

విమర్శలపాలయినా .. జగన్ కు కలిసిరాబోతోందా ?