ఈ మధ్యకాలంలో చాలామందిలో విటమిన్ బి12 లోపం వలన అరికాళ్ళు, అరిచేతుల్లో మంటలు( Burning Feet ) వస్తున్నాయి.అయితే విటమిన్ బి12 లోపం వలన మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ముఖ్యంగా మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు ఈ విటమిన్ లోపం కారణంగా చాలామందిలో అరికాళ్ళలో మంట సమస్యలు వస్తున్నాయి.దీని కారణంగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు.
అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.అయితే చాలామందిలో అరికాళ్ళలో రక్తప్రసరణ వ్యవస్థ( Circulatory system ) దెబ్బతినడం కారణంగా ఈ మంట సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక మరికొందరిలో శరీరంలో విటమిన్ బి12 లోపం వలన కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఇలాంటి సమస్యలను ఎంత సులభంగా తగ్గించుకోవాలనుకుంటే అంత మంచిది లేదా ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఆరోగ్య నిపుణులు అరికాళ్ళలో మంట తగ్గించడానికి కొన్ని చిన్న చిట్కాలు పాటించాలని సూచించారు.అయితే ఆ చిన్న చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పాత్రలో వేడి నీటిని తీసుకొని అందులో మీ అరికాళ్ళను ఒక ఆరు నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది.ఇక ఆ తర్వాత మరో నాలుగు నిమిషాల పాటు అరికాళ్ళను చల్లని నీటిలో పెట్టాలి.
ఇలా రోజుకు మూడుసార్లు చేయడం వలన అరికాళ్లలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

అలాగే ఈ చిట్కా ప్రతిరోజు పాటిస్తే మరింత ఫలితం ఉంటుంది.అంతేకాకుండా ఇలా చేయడం వలన సులభంగా మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇక తరచూగా అరికాళ్ళలో మంటలతో బాధపడేవారు గుమ్మడికాయ( Pumpkin )తో తయారు చేసిన మిశ్రమం తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందుతారు.
అయితే ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేయడం వలన సులభంగా ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.