నల్లగొండ జిల్లా:నాగార్జున సాగర్ ప్రాజెక్టు( Nagarjuna sagar )లో నీరులేక ఎడమకాల్వ కింద సాగయ్యే 6.40 లక్షల ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లో 3.80 లక్షల ఎకరాలకు నీళ్ళు లేక బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.వానాకాలం పంటలకే ఇబ్బంది ఏర్పడిన నేపథ్యంలో యాసంగి సాగు ప్రశ్నార్ధకంగా మారింది.కనీసం ఒక్క తడికైనా నీరు అందుతుందనే ఆశతో చెరువులు,కుంటలు,బావువు,బోర్ల కింద సాగు చేస్తే ఆ పంట కూడా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదని వాపోతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ యాసంగిలో ఆయకట్టు భారీగా తగ్గింది.నీటి కొరతతో సాగర్ కింద ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్ వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ( Mission Bhagiratha ) కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతంనాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో పూర్తి స్థామర్ధ్యం 590 అడుగులు కాగా,గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 590.00/520.20 ఫీట్లు,(149.6410 టిఎంసిలు/312.5050 టిఎంసిలు) లకు చేరుకుంది.ఇదిలా ఉంటే సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా,మరో పది అడుగుల నీరు తగ్గితే సాగర్ డెడ్ స్టోరేజీ చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు