1.జనవరి 26 నుంచి ప్రియాంక యాత్ర
ప్రియాంక గాంధీ జనవరి 26వ తేదీ నుంచి హత్ సే హత్ జోడో యాత్ర నిర్వహించబోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు.
2.ఎన్టీఆర్ పై వెంకయ్య నాయుడు కామెంట్స్
రాజకీయాలలో కొత్తవరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.
3.జగన్ పై బుచ్చయ్య కామెంట్స్
వైసిపికి ఇవే చివరి ఎన్నికలని రాజమండ్రి టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.మళ్లీ కరోనా రావాలని సీఎం జగన్ పూజలు చేస్తున్నారంటూ బుచ్చయ్య విమర్శలు చేశారు.
4.ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో అరెస్ట్
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు మోసపూరితంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ , ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సిబిఐ అరెస్ట్ చేసింది.
5.రాష్ట్రపతికి ‘ దండార్ తో స్వాగతం
ఈనెల 26న హైదరాబాద్ నగరానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది మూర్ము కు గిరిజనుల్లోని కోలాం తెగ తమ దండార్ నృత్యంతో స్వాగతం పలకనుంది.
6.జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది .ప్రత్యేక బడ్జెట్ సమావేశాలను బిజెపి కార్పొరేటర్లు అడ్డుకున్నారు.మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు.
7.జనసేనతోనే పొత్తు : బీజేపీ
జనసేనతో తప్ప మరో పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని బిజెపి ఎమ్మెల్సీ టీవీఎస్ మాధవ్ వ్యాఖ్యానించారు.
8. బండి సంజయ్ పై జోగు రామన్న కామెంట్స్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న కామెంట్ చేశారు .దమ్ముంటే రైతులకు ఎనిమిదిన్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ చేశారు.
9.తిరుమల సమాచారం
ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్లైన్ లో 10 రోజులకు సంబంధించి రెండు లక్షల ప్రత్యేక దర్శనం టికెట్లను టిటిడి విడుదల చేసింది.
10.కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
ప్రముఖ నాటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి.జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించారు.
11.5 కే రన్
ఏపీ ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో 5 కే రన్ నిర్వహించారు.సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఏపీఆర్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్ లో భారీగా జనాలు పాల్గొన్నారు.
12.మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని చిరంజీవి చెల్లెలు మాధవి రేపు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్రారంభించనున్నారు.
13.జగన్ పై జీవీఎల్ కామెంట్స్
2024 ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ కి పరిమితం అవుతారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
14.9 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం
శీతాకాల సమావేశాల్లో మొత్తం తొమ్మిది బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి.
15.బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణ అల్పపీడనగా మారింది.ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండం గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
16.ఇండిగో స్పెషల్ ఆఫర్
విమాన ప్రయాణికుల కోసం ఇండిగో ఎయిర్లైన్స్ వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో దేశీయ విమానాలకు 2,023, అంతర్జాతీయ విమానాలకు 4,999 నుండి విమాన చార్జీలు అందుబాటులో ఉంటాయి.
17.మళ్లీ పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు.అమెరికా సినీ నటుడు మోడల్ మీర్జా బిలాల్ బేగ్ ను ఆమె వివాహం చేసుకున్నారు .
18.జ్ఞానవాపి మసీదు కేసులో తీర్పు రిజర్వ్
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని దేవత విగ్రహాలకు నిత్యం ప్రార్థన చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ తిరస్కరించిన వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జ్ఞాన్ వాపి మసీదు కమిటీ దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రజలు చేసింది.
19.ఏపీలో మూడు రోజుల వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా మారింది.ఈ అల్పపీడనం వాయుగుండం గా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.ఈ ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,850 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,380