కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మరో ఏడాది పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించనుంది.
జాతీయ ఆహార భద్రత కార్డు ఉన్న వారికి లాక్ డౌన్ సమయం నుంచి ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా ప్రభావం తగ్గినా ఉచిత రేషన్ ను పొడిగిస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే తాజాగా వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా చట్టంలో డిసెంబర్ 2023 వరకు విలీనం చేయనుంది.