అక్టోబర్ మొదటి వారంలో టీఎస్ కాంగ్రెస్ మొదటి జాబితా...?

నల్లగొండ జిల్లా: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై దూకుడు పెంచింది.అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది.

 Telangana Congress First List In October, Telangana Congress , Congress First Li-TeluguStop.com

సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు,సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది.ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కావడంతో పాటు దా దాపు 80 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సీల్డ్ కవర్ లో ఆ జాబితాను పంపినట్టుగా తెలిసింది.

ఈ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపనున్నారు.

అనంతరం అక్టోబర్‌లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది.

తొలి జాబితాలో సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి.రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు ఉన్నట్టుగా తెలిసింది.

అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువమంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది.అలాంటి స్థానాలపై ఆచితూచి వ్యవహారించాలని అధిష్టానం నిర్ణయించింది.

మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి ఇలాంటి స్థానాలపై చర్చించి రెండో జాబితాను తయారు చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 29వ తేదీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నారు.

అనంతరం తొలి జాబితాను విడుదల చేయనున్నారు.అక్టోబర్ తొలివారంలో తొలి జాబితా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మకాంవేసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలతో సైతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది.సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టిపిసిసి ముఖ్యనేతలు సర్దిచెబుతున్నట్టుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube